Today or Tomorrow! నేడో.. రేపో!
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:17 AM
Today or Tomorrow! సీతంపేట ఐటీడీఏలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం నేడే.. రేపో శ్రీకాకుళం తరలిపోనుంది. ఈ మేరకు సంబంఽధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా సీతంపేటలో ఉన్న డీడీ కార్యాలయం జిల్లాల విభజన తరువాత శ్రీకాకుళం జిల్లా పరిధిలోకి వెళ్లింది.
సిబ్బంది వివరాల సేకరణ
సీతంపేట రూరల్, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం నేడే.. రేపో శ్రీకాకుళం తరలిపోనుంది. ఈ మేరకు సంబంఽధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా సీతంపేటలో ఉన్న డీడీ కార్యాలయం జిల్లాల విభజన తరువాత శ్రీకాకుళం జిల్లా పరిధిలోకి వెళ్లింది. ఈ కార్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి తరలించేందుకు అప్పట్లోనే అక్కడి కలెక్టర్ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. వాస్తవంగా శ్రీకాకుళంలో డీడీ కార్యాలయం నిర్వహించేందుకు సరిపడా భవన సదుపాయం లేదు. దీంతో కొన్నాళ్ల పాటు తరలింపు ప్రక్రియ ఆగింది. అంతేకాకుండా డీడీ కార్యాలయం సీతంపేటలోనే ఉంచాలని గిరిజనసంఘ నాయకులు అప్పట్లో పట్టుబట్టడంతో కార్యాలయం తరలింపు సాధ్యపడలేదు. అయితే శ్రీకాకుళంలో నూతన భవన సముదాయాలు అందుబాటులోకి వచ్చాయి. బీసీ, ఎస్సీ, గిరిజనసంక్షేమశాఖలన్నీ ఒకే భవన సముదాయాల్లో ఉండాలని అక్కడి కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో సీతంపేట ఐటీడీఏలో ఉన్న డీడీ కార్యాలయం శ్రీకాకుళం తరలించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై డీడీ అన్నాదొరను వివరణ కోరగా.. సీతంపేట ఐటీడీఏలో నిర్వహిస్తున్న డీడీ కార్యాలయం సిబ్బంది వివరాలను అడిగారని, ఈ మేరకు శీకాకుళం జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు.