Share News

Today is Christmas నేడు క్రిస్మస్‌

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:57 PM

Today is Christmas క్రిస్మస్‌ పండుగ కళ వచ్చేసింది. ఇళ్లు, చర్చిలు విద్యత్‌ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్‌ ట్రీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శాంతాక్లాజ్‌ వేషధారణలో పిల్లలు, పెద్దలు ముందురోజు నుంచే సందడి చేస్తున్నారు.

Today is Christmas నేడు క్రిస్మస్‌

నేడు క్రిస్మస్‌

అందంగా ముస్తాబైన చర్చిలు

విజయనగరం కల్చరల్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ పండుగ కళ వచ్చేసింది. ఇళ్లు, చర్చిలు విద్యత్‌ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్‌ ట్రీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శాంతాక్లాజ్‌ వేషధారణలో పిల్లలు, పెద్దలు ముందురోజు నుంచే సందడి చేస్తున్నారు. వీధుల్లో క్రీస్తు భక్తి గీతాలాపన చేస్తూ ర్యాలీలు చేపట్టారు. క్రిస్మస్‌ రోజు గురువారం క్రైస్తవులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోనున్నారు. కుటుంబాల సమేతంగా భోజనాలు చేయనున్నారు. ఆహ్లాద, ఆనందకరమైన వాతావరణంలో ప్రార్థనలు చేయనున్నారు. ఈ పండుగ నేపథ్యంలో విజయనగరంలో పాస్టర్ల ఇళ్లతో పాటు ప్రధాన చర్చిలు విద్యుత్‌ కాంతుల నక్షత్రాల శోభతో ఆకట్టుకుంటున్నాయి. స్వీమ్స్‌ మెమోరియల్‌ బాప్టిస్ట్‌ చర్చి, ఆర్‌సీఎం, సెంటాన్స్‌, సెంట్‌లూథరస్‌, స్వీమ్స్‌ ప్లాటినం చర్చిల్లో బుధవారం రాత్రి నుంచే క్రిస్మస్‌ సంబరాలు ప్రారంభమయ్యాయి.

=========

Updated Date - Dec 24 , 2025 | 11:57 PM