Share News

Today is Bakrid నేడు బక్రీద్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:47 PM

Today is Bakrid ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే వాటిలో బక్రీద్‌ ఒకటి. జిల్లా కేంద్రమైన విజయనగరంతో పాటు నెల్లిమర్ల, రాజాం, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్‌.కోట, జామి, సంతకవిటి, వంగర, బొబ్బిలి, బాడంగి, తెర్లాం తదితర ప్రాంతాల్లో మసీదుల్లో శనివారం ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు.

Today is Bakrid నేడు బక్రీద్‌

నేడు బక్రీద్‌

సిద్ధమైన మసీదులు

పోలీసు బందోబస్తు ఏర్పాటు

విజయనగరం దాసన్నపేట, జూన్‌6(ఆంధ్రజ్యోతి):

ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే వాటిలో బక్రీద్‌ ఒకటి. జిల్లా కేంద్రమైన విజయనగరంతో పాటు నెల్లిమర్ల, రాజాం, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్‌.కోట, జామి, సంతకవిటి, వంగర, బొబ్బిలి, బాడంగి, తెర్లాం తదితర ప్రాంతాల్లో మసీదుల్లో శనివారం ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. వివిధ షాపులు, వాణిజ్య సముదాయాలలో పనిచేస్తున్న ముస్లింలకు ఇప్పటికే సెలవు ఇచ్చారు. విజయనగరంలోని అబాద్‌వీధి, కంటోన్మెంట్‌, మూడులాంతర్లు, అంబటిసత్తర్వు, బాబామెట్ట మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నాయి. నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రార్థనల్లో భాగంగా బక్రీద్‌ విశిష్టతను ఇమామ్‌లు వివరించనున్నారు.

పటిష్ట పోలీసు బందోబస్తు : ఎస్పీ వకుల్‌జిందాల్‌

బక్రీద్‌ను మతసామరస్యానికి ప్రతీకగా సోదరభావంతో, శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ వకుల్‌జిందాల్‌ కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మసీదుల వద్ద ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. డ్రోన్‌, సీసీ కెమెరాలతోనూ పర్యవేక్షించాలని సూచించారు.

Updated Date - Jun 06 , 2025 | 11:47 PM