Auto Drivers నేడు ఆటోడ్రైవర్ల సేవలో..
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:08 AM
Today in the Service of Auto Drivers ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 వేలు శనివారం జమ చేయనుంది. ఇటీవల స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రోజుకు లక్షలాది మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు ఉపాధి లేకుండా పోతోందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందారు. గమనించిన సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లను తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. అందులో భాగంగా ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రకటించారు.
పార్వతీపురం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 వేలు శనివారం జమ చేయనుంది. ఇటీవల స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రోజుకు లక్షలాది మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు ఉపాధి లేకుండా పోతోందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందారు. గమనించిన సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లను తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. అందులో భాగంగా ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రకటించారు. అర్హులైన ఆటో డ్రైవర్లను ఎంపిక చేసి వారి ఖాతాల్లో శనివారం రూ.15 వేల చొప్పున నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. విజయవాడలో సీఎం చంద్రబాబు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలోని 5,217 మందిని అర్హులుగా గుర్తించారు. వారికి రూ.7.82 కోట్లను జమ చేయనున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో 1549 మందికి, కురుపాం 1347, పాలకొండలో 1251, సాలూరులో 1070 మందికి లబ్ధిచేకూరనుంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మంత్రి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు శనివారం జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనున్నారు.