Share News

పొగాకుతో క్యాన్సర్‌ వ్యాధులు: డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:05 AM

పొగాకు తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలతోపాటు ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే అవకాశముందని డీ ఎంహెచ్‌వో ఎస్‌.జీవనరాణి హెచ్చరించారు.

పొగాకుతో క్యాన్సర్‌ వ్యాధులు: డీఎంహెచ్‌వో
విజయనగరం రింగురోడ్డు:ర్యాలీని ప్రారంభిస్తున డీఎంహెచ్‌వో:

విజయనగరం రింగురోడ్డు, మే 31 ( ఆంధ్రజ్యోతి): పొగాకు తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలతోపాటు ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే అవకాశముందని డీ ఎంహెచ్‌వో ఎస్‌.జీవనరాణి హెచ్చరించారు. శనివారం విజయనగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఆవరణలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని వైద్య సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు వైద్యాధికారి కె.రాణి, జిల్లా టీబీ నివారణాధికారి కుమార్‌, ఎస్‌.సూర్యనారాయణ, పీఓఎస్‌ సీడీ డాక్టరు వీవీ సుబ్ర హ్మణ్యం, ఎఫ్‌ఎల్‌ఓ రమణి, డెంటల్‌ హెచ్‌ఓడీ జనార్దన్‌, కామేశ్వరరావు, పాల్గొన్నారు.

ఫనెల్లిమర్ల,మే 31(ఆంధ్రజ్యోతి):పొగాకు ఉత్పత్తుల వినియోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని రెడ్‌క్రాస్‌ జిల్లా వైద్యాధికారి వేణుగోపాలరెడ్డి సూ చించారు. మండలంలోని రామతీర్థంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్కరించుకుని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మిమ్స్‌గ్రామీణ వైద్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వేణుగోపాలరెడ్డి మాట్టాడారు. కార్యక్రమంలో మిమ్స్‌ గ్రామీణ వైద్య కేంద్రం వైద్యులు షణ్ముఖ, వాహిని, రెడ్‌ క్రాస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సీహెచ్‌, మన్మఽథరావు పాల్గొన్నారు

ఫ కొత్తవలస, మే 31(ఆంధ్రజ్యోతి): పొగాకు ఉత్సత్తుల వాడకానికి దూరంగా ఉండాలని వియ్యంపేట పీహెచ్‌సీ వైద్యాధికారి గోపాల కృష్ణ కోరారు. వియ్యంపేటలో వైద్యాధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు.కార్యక్రమంలో సిబ్బంది నరసింహారావు, జగదాంబ, పద్మావతి, ఈశ్వరరావు, ఆశాజ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:05 AM