ప్రయాణం సాఫీగా సాగేలా..
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:57 PM
సంక్రాంతి నాటికి రహదారులన్నీ బాగు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం కదిలింది.
రోడ్లను బాగు చేస్తున్న ప్రభుత్వం
కొన్నిచోట్ల పూర్తయిన పనులు
పార్వతీపురం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి నాటికి రహదారులన్నీ బాగు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం కదిలింది. ఈ మేరకు జిల్లాలోని వివిధ రహదారులను అధికారులు బాగు చేస్తున్నారు. గోతులు, రాళ్లతో నిండిన రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నారు. గతంలో సాలూరు-మక్కువ రోడ్డు అధ్వానంగా ఉండేది. దీంతో కొన్ని రోజులు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, పార్వతీపురం-కోనేరు రహదారి, సీతంపేట మండలంలోని నౌగూడ రోడ్డు దారుణంగా ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ బాగు పడుతున్నాయి. ఇప్పటికే నౌగూడ రోడ్డుతో పాటు వెంకంపేట నుంచి ఏఆర్ నగరం (ఏవోబీ కోరాపుట్) వరకు వెళ్లే రహదారి పనులు కూడా పూర్తయ్యాయి. పార్వతీపురం-కోనేరు రోడ్డును కూడా బాగు చేస్తుండడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రహదారుల మరమ్మతుల కూడా సంక్రాంతి నాటికి పూర్తి చేయనున్నారు.