Share News

స్వదేశానికి తీసుకురావాలి

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:41 PM

వేట సాగిస్తూ బంగ్లాదేశ్‌ జలాల్లోకి వెళ్లి నేవీ అధికారులకు చిక్కి అక్కడ జైలులోఉన్న భోగాపురం, పూసపాటిరేగ మండ లాలకు చెందిన మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.

స్వదేశానికి తీసుకురావాలి
హరేంద్రప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న మత్స్యకారులు :

భోగాపురం, నవంబరు17(ఆంధ్రజ్యోతి): వేట సాగిస్తూ బంగ్లాదేశ్‌ జలాల్లోకి వెళ్లి నేవీ అధికారులకు చిక్కి అక్కడ జైలులోఉన్న భోగాపురం, పూసపాటిరేగ మండ లాలకు చెందిన మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.ఈమేరకు ఆయా కుటుంబాల సభ్యులు, మత్స్యకార నాయకులు సూరాడ చిన్నారావు, వంగా గురుమార్తి ఆధ్వర్యంలో సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంద్రప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. బంగ్లాదేశ్‌లోఉన్న మత్స్యకారులను స్వగృహాలకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇక్కడకు వచ్చే వరకు ఆయా కుటుంబాలను ప్రతినెలా ఆర్థికంగా ఆదుకోవాలని వినతి పత్రం కోరా రు. విశాఖ జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మణరావుకు సమస్య పరిష్కరిం చాలని కలెక్టర్‌ కోరారు. కాగా మత్స్యకారుల వినతి మేరకు విజయవాడలోని మత్స్య శాఖ కమిషనర్‌, విజయనగరంజిల్లా కలెక్టర్‌కు సమస్యను నివేదించి సమస్య పరిష్క రిస్తామని లక్ష్మణరావు తెలిపారు.

Updated Date - Nov 17 , 2025 | 11:41 PM