కల్యాణ వేంకటేశ్వరస్వామికి తిరుప్పావడ సేవ
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:23 AM
వేపాడలోని శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తిరుప్పావడ సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
వేపాడ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): వేపాడలోని శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తిరుప్పావడ సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ధర్మకర్త రాపర్తి చిరంజీవిప్రసాద్ ఆధ్వర్యంలో ఆష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలతో విశేష అలంకరణ చేయగా నక్షత్ర హారతి ఆకర్షణీయంగా నిర్వహించారు. తిరుప్పావడ సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.