won’t cool you down చినుకులు పడినా చల్లబడలే
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:59 PM
Tiny drops won’t cool down. సాలూరు ఏజెన్సీలో విభిన్న వాతావరణం నెలకొంది. రోజంతా చినుకులు పడుతున్నా.. వాతావరణం మాత్రం చల్లగా మారలేదు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురుశాయి. అయితే ఉక్కబోత కూడా అధికంగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
జిల్లాలో విభిన్న వాతావరణం
సాలూరు రూరల్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): సాలూరు ఏజెన్సీలో విభిన్న వాతావరణం నెలకొంది. రోజంతా చినుకులు పడుతున్నా.. వాతావరణం మాత్రం చల్లగా మారలేదు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురుశాయి. అయితే ఉక్కబోత కూడా అధికంగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చినుకులు కురుస్తున్నా.. వాతావరణంగా వేడిగా ఉండడంతో ఫ్యాన్లు, ఏసీల చెంతకు చేరారు. ఇదిలా ఉండగా వర్షం పత్తి పంటకు అనుకూలించింది. పలువరు రైతులు మొక్కజొన్న విత్తనాలను నాటుకున్నారు. కాగా ఇప్పటికే చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రక్షించుకోవడానికి రైతులు తిప్పలు పడ్డారు.