Rakhi రాఖీ కట్టి.. ఆశీర్వాదం పొంది..
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:32 PM
Tied Rakhi and Received Blessings ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాఖీ కట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాని.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రికి ఆమె రాఖీ కట్టి ఆశీర్వాదం పొందారు.
పార్వతీపురం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాఖీ కట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాని.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రికి ఆమె రాఖీ కట్టి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాఖీ పండగ సందర్భంగా సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఇది మరువలేని రోజు అని తెలిపారు. ‘గిరిజనుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. గతంలో తమ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్-3పై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గిరిజనులకు ఇబ్బందులు లేకుండా దాని స్థానంలో ప్రత్యామ్నాయ జీవోను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. గిరిజన యూనివర్సిటీని త్వరగా పూర్తి చేస్తామని, డోలీలు మోత లేకుండా రహదారులు నిర్మించాలని, నిధులు మంజూరుకు వెనకాడేది లేదని, ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయం.’ అని తెలిపారు. ఆదివాసీలపై ఉన్న అభిమానాన్ని సీఎం చాటుకున్నారని మంత్రి సంధ్యారాణి శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌లో వెల్లడించారు.