PACS పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు
ABN , Publish Date - Jul 08 , 2025 | 10:50 PM
Three-Member Committees for PACS ఉమ్మడి జిల్లాలో 94 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు త్రిసభ్య కమిటీ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్‌మెంట్ పలు పీఏసీఎస్ లకు చైర్మన్, మరో ఇద్దరు సభ్యులను నియమిం చింది.
పాలకొండ, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో 94 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు త్రిసభ్య కమిటీ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్‌మెంట్ పలు పీఏసీఎస్ లకు చైర్మన్, మరో ఇద్దరు సభ్యులను నియమిం చింది. వీరి ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల సీఈవో, కార్యదర్శులు పనిచేస్తారు. ఎన్నికలు జరిగే వరకూ సహకార సంఘాలకు త్రీ సభ్య కమిటీలే కొన సాగనున్నాయి. పీఏసీఎస్‌ల చైర్మన్, సభ్యుల పదవీకాలం అక్టోబరు వరకు ఉంటుంది. వారు ఈ నెల 10 నుంచి బాధ్యతలు చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.