PACS మరో 15 పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:35 PM
Three-Member Committees for Another 15 PACS జిల్లాలో కొత్తగా మరో 15 పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలను నిమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారి పాలన గడువు వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఉంటుంది. ఈ లోపు ఎన్నికలు జరిగితే కొత్త పాలకవర్గం ఆయా పీఏసీఎస్‌ల బాధ్యతలు చేపట్టనుంది.
పార్వతీపురం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా మరో 15 పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలను నిమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారి పాలన గడువు వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఉంటుంది. ఈ లోపు ఎన్నికలు జరిగితే కొత్త పాలకవర్గం ఆయా పీఏసీఎస్‌ల బాధ్యతలు చేపట్టనుంది. అప్పటివరకు త్రిసభ్య కమిటీల ఆధ్వర్యంలో పాలన కొనసాగుతుంది. చినమేరంగి, గరుగుబిల్లి, పార్వతీపురం, కృష్ణపల్లి, బూర్జ , గడ్డలుప్పి, పాపమ్మవలస, ఆర్‌వీ పేట, అంటిపేట, తామరకండి, అజ్జాడ, పలగర, గలావల్లి, సాలూరు, కేసలి పీఏసీఎస్‌ల్లో అధ్యక్షుడితో పాటు ఇద్దరు సభ్యులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 41 పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలను ప్రకటించారు. వాస్తవంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరిగి దశాబ్దం దాటిపోతుంది. 2013లో ఎన్నికైన పాలకవర్గం పదవీకాలం తర్వాత ఎన్నికలు జరగలేదు. అప్పటి నుంచి అధికార పార్టీ నాయకులే కమిటీ చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు.