మూడు టన్నుల పశుమాంసం సీజ్
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:09 AM
మండలంలోని పోలీసు స్టేషన్‌కు సమీ పంలో జాతీయ రహదారిపై మూడు టన్నుల పశుమాంసాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకుని, సీజ్ చేశారు.
బొండపల్లి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని పోలీసు స్టేషన్‌కు సమీ పంలో జాతీయ రహదారిపై మూడు టన్నుల పశుమాంసాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకుని, సీజ్ చేశారు. స్థానిక ఎస్‌ఐ యు.మహేష్ శని వారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు నుంచి రాజమండ్రికి అక్ర మంగా వ్యానులో 3 టన్నుల పశుమాంసాన్ని తరలిస్తున్నట్టు ముందుగా పోలీ సులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి దాడిచేసి, ఆ వ్యాన్‌ను పట్టుకున్నారు. అందులో మాంసాన్ని గుర్తించారు. ఈ మాంసాన్ని బొండపల్లి పశువైద్యాధికారి ఎం.కిరణ్‌కుమార్ పరీక్షించి పశుమాంసంగా నిర్ధారిం చారు. దీంతో వాహనాన్ని పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. ఎస్‌ఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.