Share News

మూడు తులాల బంగారం చోరీ

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:29 PM

దేశపాత్రునిపాలెం పంచాయతీ శివారు శీరం శెట్టివానిపాలెం గ్రామంలోని ఒక ఇంటిలోకి శనివారం అర్ధరాత్రి దుండగులు చొరబడి సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.24వేల నగదు దోచుకున్నారు.

మూడు తులాల బంగారం చోరీ

కొత్తవలస, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): దేశపాత్రునిపాలెం పంచాయతీ శివారు శీరం శెట్టివానిపాలెం గ్రామంలోని ఒక ఇంటిలోకి శనివారం అర్ధరాత్రి దుండగులు చొరబడి సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.24వేల నగదు దోచుకున్నారు. కంటకాపల్లి పంచాయతీలోని శారడా కర్మాగారంలో పనిచేస్తున్న మీసాల రవి ప్రకాష్‌ అనే వ్యక్తి దేశపాత్రునిపాలెం వద్ద డెక్కన్‌ ఫెర్రోఅల్లాయిస్‌ కర్మాగారం సమీపంలోనున్న శీరంశెట్టివానిపాలెం గ్రామానికి కొద్ది దూరంలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వా త ఈ ఇంటికి ఒక వ్యక్తి ముందుగా వెళ్లి తలుపుకొట్టాడు. దీంతో రవిప్రకాష్‌ మామయ్య రాము తలుపు తీసి చూడగా.. ఆ వ్యక్తి బెదిరించి లోపలికి చొరబడ్డాడు. ఆ వెంటనే మరో ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి రవిప్రకాష్‌ భార్య సత్యవతిని, మిగిలిన కుటుంబ సభ్యులను బెదిరించారు. మూడు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.24వేల నగదును దోచుకున్నారు. అందిన సమచా రం మేరకు ఎస్‌.కోట రూరల్‌ సీఐ అప్పలనాయుడు, కొత్తవలస ఎస్‌ఐ జోగారావు ఘటనా స్థలానికి వెళ్లి, పరిశీలించారు. విజయనగరం నుంచి క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలను సేకరించింది. రవిప్రకాష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేయగా, ఎస్‌ఐ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 11:29 PM