హ్యాండ్‌బాల్ పోటీలకు ముగ్గురి ఎంపిక
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:13 AM
జిల్లాకు చెందిన ముగ్గురి బాలికలు జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 హ్యాండ్‌బాల్ బాలికల రాష్ట్రస్థాయిపోటీల్లో జిల్లాకుచెందిన క్రీడాకారులు ప్రతిభకనబరిచి ద్వితీ యస్థానం కైవాసం చేసుకున్నారు. ఎ
శ్రీకాకుళం స్పోర్ట్స్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన ముగ్గురి బాలికలు జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 హ్యాండ్‌బాల్ బాలికల రాష్ట్రస్థాయిపోటీల్లో జిల్లాకుచెందిన క్రీడాకారులు ప్రతిభకనబరిచి ద్వితీ యస్థానం కైవాసం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పటమట కేబీసీ జడ్పీ హైస్కూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి సోమవారం వరకుజరిగాయి.ఫైనల్‌లో హోరాహోరీగా తలపడినా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.నారువ జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన మౌనిక, శ్రీకాకుళం ఉమెన్స్ కళాశాల విద్యార్థిని దివ్య, శ్రీకాకుళం లోని ఓ ప్రైవేటుస్కూల్‌కు చెందిన జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆ జట్టుకు కోచ్‌గా ఆర్.సతీష్‌రాయుడు వ్యవహరించారు.
కబడ్డీలో సత్తాచాటిన బాలిబాలికల జట్లు
గుజరాతీపేట, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కడపలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీపోటీల్లో బాలబాలికలు జట్లు సత్తాచాటాయి.ఈ మేరకు ప్రఽథమ, ద్వితీయస్థానాలు సాధించాయి. కాగా ఆయా జట్ల సభ్యులు శ్రీకా కుళంలోని విశాఖ ఎ కాలనీలోగల టీడీపీ కార్యాలయంలో సోమవారం మ్మెల్యే గొండు శంకర్ కలిశారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ సంఘం ప్రతి నిధులు రామకృష్ణ, ముసలినాయుడు, ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పతకం
బూర్జ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):మండలంలోని ఓవీపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గిరడ మాధురి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటి మూడో స్థానంలో నిలిచింది.ఇటీవల విజయవాడలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో అండర్-14 విభాగం తరపున మాధురి కాంస్యపతకాన్ని సాధించింది.ఈ మేరకు సోమవారం మాధురి తోపాటు పీడీ ఎన్.సురేష్‌కుమార్‌కు హెచ్‌ఎం కృష్ణవేణి అభినందించారు.