Share News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:54 PM

మండలంలోని కోమటిపల్లి జంక్షన్‌ వద్ద ఆదివారం మానాపురం నుంచి గొబ్యాం వైపు వెళుతున్న ఆటోను అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్‌ లారీ వేగంగా వచ్చి ఢీకొంది.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

దత్తిరాజేరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోమటిపల్లి జంక్షన్‌ వద్ద ఆదివారం మానాపురం నుంచి గొబ్యాం వైపు వెళుతున్న ఆటోను అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్‌ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామభద్రపురం కొత్తరేగ గ్రామానికి చొక్కాపు అప్పలనాయుడు, అల్లు గౌరమ్మ, ఆటో డ్రైవర్‌ మామిడి నాగరాజుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 28 , 2025 | 11:54 PM