Share News

గంజాయితో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:19 AM

కనిమెరక రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని.. 3.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు.

గంజాయితో ముగ్గురి అరెస్టు

బొండపల్లి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కనిమెరక రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని.. 3.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. శుక్రవారం నింధితులను విలేకరుల ముందు హాజరుపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపాలెం గ్రామానికి చెందిన బండారు రాము, విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొత్సపేటకు చెందిన జి.గణేష్‌తో పాటు ఒక మహిళను అరెస్టు చేసిన ట్లు తెలిపారు. వీరు ముగ్గురూ వినాయక ఉత్సవాల్లో అమ్మకాలు జరిపేందుకు రాయగడ నుంచి గంజాయి తీసుకు వచ్చారని వివరించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సీఐతోపాటు ఎస్‌ఐ యు.మహేష్‌, ట్రైనీ ఎస్‌ఐ పడాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 12:19 AM