Share News

తోటపల్లి కాలువ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:52 PM

తోటపల్లి కాలువల సమస్య పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈ మేరకు కాలువసమస్యలపై మే ఆరోతేదీన సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చనున్నట్లు తెలిపారు.

 తోటపల్లి కాలువ సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న కృష్ణమూర్తి

పాలకొండ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి కాలువల సమస్య పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈ మేరకు కాలువసమస్యలపై మే ఆరోతేదీన సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చనున్నట్లు తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి ప్రా జెక్టు లక్షా80 వేల ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా నేటికీ పరి ష్కారం కాలేదన్నారు. డిసెంబర్‌ నుంచి పనులు ప్రారంభించి ఇప్పటికే పని పూర్తి చేస్తే జూన్‌కు సాగునీరు అందింవచ్చునన్నారు. కాని ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని ఆక్షేపించారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే 590 కోట్లు అవసరమని ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళికలు సిద్దం చేసినా ప్రభుత్వం రూ.47 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటా యించడం సరికాదన్నారు.అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు మాట్లాడుతూ తోటపల్లి కాలువ సమస్య పరిష్కారానికి రాజకీయాలకతీతంగా రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయాలన్నారు. సమావేశం లో సింహాద్రి, కరణం అప్పారావు, సోమశేఖర్‌, గంగుల శ్రీనివాసరావు, వెన్నపు చిన్న, నారాయణరావు, మజ్జి చంటిబాబు, శాసపు మన్మథరావు, శాసపు విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:52 PM