Share News

పర్యాటక కేంద్రంగా తోటపల్లి

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:17 AM

తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగ దీశ్వరి, కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

పర్యాటక కేంద్రంగా తోటపల్లి
ఐటీడీఏ పార్కును పారంభిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

- తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు

- ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- ఐటీడీఏ పార్కు పునఃప్రారంభం

- బోటు షికారు కూడా..

గరుగుబిల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగ దీశ్వరి, కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సుంకి ప్రాంతంలోని పార్వతీపురం ఐటీడీఏ పార్కును గురువారం వారు పునఃప్రారంభించారు. బోటు షికారును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పార్కుతో పాటు బోటు షికారు మూలకు చేరిందన్నారు. ఈ ప్రాంతం పర్యాట కానికి అనువుగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తదుపరి పార్కు అభివృద్ధితో పాటు బోటు షికారుకు అవసరమైన చర్యలను కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ సి.య శ్వంత్‌కుమార్‌రెడ్డి చేపట్టారన్నారు. యంత్రాం గం చొరవతో తోటపల్లికి కొత్తదనం సంతరించు కుందని అన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. తోటపల్లిని అభివృద్ధి చేయాలని ప్రత్యేక సంకల్పంగా పెట్టు కున్నట్లు తెలిపారు. ఈ బాధ్యతను పార్వతీపు రం ఐటీడీఏ శాఖకు అప్పగించామన్నారు. ఐటీడీఏ పార్కు, బోటు షికారును సద్వినియోగం చేసుకోవాలని పర్యాటకులను కోరారు. పార్కు ప్రాంతంలో అవసరమైన సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉరిటి రామారావు, కార్పొరేషన డైరెక్టర్లు ఎ.మధుసూదనరావు, అంబటి గౌరునాయుడు, సర్పంచ్‌ కె.రవీంద్ర, ఎంపీటీసీ సభ్యులు ద్వారపురెడ్డి సత్యనారాయణ, వై.శ్రీనివాసరావు, పార్టీ ప్రతినిధులు ఎం.పురుషోత్తంనాయుడు, ఎం.తవిటినాయుడు, నారాయణస్వామి, ఎంపీడీవో జి.పైడితల్లి, తహసీల్దార్‌ పి.బాల, పలు శాఖల అధికారులు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:17 AM