Share News

Illegal Layouts… అవి అక్రమ లేఅవుట్లే..

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:13 PM

Those are Illegal Layouts… కురుపాం మేజర్‌ పంచాయతీలో ఏర్పాటు చేసినవన్నీ అక్రమ లేఅవుట్లేనని బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) ఏపీవో ఎం.వాణి తెలిపారు. మంగళవారం ఆమె కురుపాం పంచాయతీ కార్యాలయంలో రియల్టర్లతో సమావేశమయ్యారు. ముందుగా వారికి నూతన జీవోలను వివరించారు. నిబంధనల మేరకు ఫీజులు చెల్లించాలని ఆదేశించారు.

 Illegal Layouts… అవి అక్రమ లేఅవుట్లే..
రియల్టర్లతో మాట్లాడుతున్న బుడా ఏపీవో వాణి, సిబ్బంది

  • తేల్చి చెప్పిన బుడా ఏపీవో వాణి

జియ్యమ్మవలస, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కురుపాం మేజర్‌ పంచాయతీలో ఏర్పాటు చేసినవన్నీ అక్రమ లేఅవుట్లేనని బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) ఏపీవో ఎం.వాణి తెలిపారు. మంగళవారం ఆమె కురుపాం పంచాయతీ కార్యాలయంలో రియల్టర్లతో సమావేశమయ్యారు. ముందుగా వారికి నూతన జీవోలను వివరించారు. నిబంధనల మేరకు ఫీజులు చెల్లించాలని ఆదేశించారు. అయితే 23 మంది రియల్టర్లలో కేవలం నలుగురే వచ్చారు. కాగా కురుపాం పంచాయతీ పరిధిలో 23 మంది లేఅవుట్లు వేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ అవేవీ బుడా ఎప్రూవల్‌కు రాలేదని స్పష్టం చేశారు. కేవలం మూడు మాత్రమే వచ్చాయన్నారు. దీనిపై పంచాయతీ పరిపాలనాధికారి కంది సురేష్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరిలో కర్రి సత్యనారాయణ, చిన్నారి ప్రసాద్‌, మార్చిలో పొట్నూరు వెంకటరావు, అంధవరపు సునీత, ఏప్రిల్‌లో కోరాడ వెంకటరమణలు బుడా ఎప్రూవల్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే బుడాకు ఎవరూ రాలేదని ఏపీవో వాణి తేల్చి చెప్పారు. అక్రమ లేఅవుట్ల విషయంలో పంచాయతీ అధికారులే చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:13 PM