Share News

Door-to-Door Survey పక్కాగా ఇంటింటి సర్వే

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:25 PM

Thorough Door-to-Door Survey గ్రామాల్లో పక్కాగా ఇంటింటి సర్వే నిర్వహించి జ్వర పీడితులను గుర్తించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులపై వైద్యాధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

  Door-to-Door Survey  పక్కాగా ఇంటింటి సర్వే
కేసుల వివరాలను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

సీతానగరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పక్కాగా ఇంటింటి సర్వే నిర్వహించి జ్వర పీడితులను గుర్తించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులపై వైద్యాధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శుక్రవారం లక్ష్మీపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టే వరకు వైద్య శిబిరం కొనసాగించాలని సూచించారు. ఎటువంటి కేసులు వచ్చినా వెంటనే చూడాలన్నారు. పారిశుధ్యం లోపం కారణంగా అక్కడక్కడా ఫీవర్స్‌ ప్రబలుతున్నాయని, ఇవి కేవలం సీజనల్‌ జ్వరాలేనని వెల్లడించారు. ఈ పరిశీలనలో జిల్లా ప్రోగ్రాం అధికారి రఘు, డాక్టర్‌ రమ్యసాయి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:25 PM