Share News

This time one hundred kilos ఈసారి వంద కిలోలు

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:59 PM

This time one hundred kilos జిల్లా మీదుగా తరలిస్తున్న గంజాయి మరోసారి పట్టుబడింది. ఈసారి వంద కిలోల సరుకును పోలీసులు గుర్తించారు. బొండపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొట్లాం బైపాస్‌ రోడ్డులో రవాణాదారులను పట్టుకున్నారు. కారును సీజ్‌ చేసి నలుగురిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్‌జిందాల్‌ ఆ వివరాలు తెలిపారు.

This time one hundred kilos ఈసారి వంద కిలోలు
విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేస్తున్న ఎస్పీ వకుల్‌జిందాల్‌

ఈసారి వంద కిలోలు

మళ్లీ పట్టుబడిన గంజాయి

ఒడిశా నుంచి తమిళనాడుకు చేర్చాలని ప్రణాళిక

ఛేదించిన బొండపల్లి పోలీసులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్‌జిందాల్‌

విజయనగరం క్రైమ్‌, అగస్టు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా మీదుగా తరలిస్తున్న గంజాయి మరోసారి పట్టుబడింది. ఈసారి వంద కిలోల సరుకును పోలీసులు గుర్తించారు. బొండపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొట్లాం బైపాస్‌ రోడ్డులో రవాణాదారులను పట్టుకున్నారు. కారును సీజ్‌ చేసి నలుగురిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్‌జిందాల్‌ ఆ వివరాలు తెలిపారు.

జిల్లా మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఎస్పీ ఆదేశాలతో బొండపల్లి పోలీసులు, ఈగల్‌టీమ్‌, తదితర బృందాలు అప్రమత్తమయ్యాయి. తనిఖీలు చేపట్టాయి. బొండపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి గొట్లాం బైపాస్‌ రోడ్డులో శనివారం అటుగా వచ్చే ప్రతి వాహనాన్నీ ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో షిప్టుకారును కూడా ఆపి ఆరా తీశారు. 48 ప్యాకెట్లతో 100 కిలోల గంజాయి ఉన్నట్లు తేల్చారు. ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్నారు. నిందితుల్లో ఒకరు పరారీ అవ్వగా నలుగురిని అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రం కోరాఫుట్‌ జిల్లా కొట్టంగి తాలూక పుకలి గ్రామానికి చెందిన మనోరంజన్‌ మిశ్రా ఇచ్చిన సమాచారంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం దళాయిపాలెం గ్రామానికి చెందిన దళాయి రామరాజు, భీమిలి మండలం తగరపువలస నిమ్మవానిపేట విరుమండి గోపి, తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌ జిల్లా నర్ధాం గ్రామానికి చెందిన పాండ్యమ్‌ మాణిఖ్యమ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

- దళాయి రామరాజు, ఇరుమండి గోపి స్నేహితులు. వీరికి కోరాఫుట్‌ జిల్లాకు చెందిన, సుదర్శన్‌ కోరాతో పరిచయం ఉంది. అతని సహాయంతో గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పాండ్యిన్‌ మాణిక్యంతో కలిసి లారీల్లో తరలిస్తుంటారు. వీరు మనోరంజన్‌ మిశ్రాతో కలిసి కారులో గంజాయిని తరలించేందుకు మొత్తంగా రూ.40వేలకు బేరం కుదుర్చుకున్నారు. మనోరంజన్‌ మిశ్రాకు అక్రమ రవాణాకు సహాయపడేందుకు పియూష్‌పడాల్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. పియూష్‌పడాల్‌, సుదర్శన్‌ కోరాను త్వరలోనే పట్టుకుంటామని అరెస్ట్‌ చేసిన నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో గజపతినగరం సీఐ జీఏవీ రమణ, బొండపల్లి ఎస్‌ఐ మహేష్‌, ట్రైనింగ్‌ ఎస్‌ఐ సాయిరాం పడాల్‌, పీసీలు అప్పలనాయడు, రవికుమార్‌, అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 11:59 PM