Don’t Come Back Again! ఇది ఒడిశా.. మళ్లీ రావొద్దు!
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:00 AM
This is Odisha... Don’t Come Back Again! ‘ఇది ఒడిశా గ్రామం.. ఏపీ వైద్యశిబిరం ఇక్కడ నిర్వహించొద్దు.’ అని తోణాం వైద్యాధికారి అక్యాన అజయ్‌కు ఒడిశా రాష్ట్రం పొట్టంగి తహసీల్దార్ దేవేంద్రసింగ్ బహదూర్ దరువా అభ్యంతరం చెప్పారు.
ఏపీ వైద్యాధికారికి ఒడిశా అధికారి అభ్యంతరం
సాలూరు రూరల్, జూలై 11(ఆంధ్రజ్యోతి): ‘ఇది ఒడిశా గ్రామం.. ఏపీ వైద్యశిబిరం ఇక్కడ నిర్వహించొద్దు.’ అని తోణాం వైద్యాధికారి అక్యాన అజయ్‌కు ఒడిశా రాష్ట్రం పొట్టంగి తహసీల్దార్ దేవేంద్రసింగ్ బహదూర్ దరువా అభ్యంతరం చెప్పారు. సాలూరు మండలంలో ఉన్న ఏవోబీ వివాదస్పద కొఠియా గ్రూప్ పణికి గ్రామంలో శుక్రవారం ఏపీ 104 వాహన వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అజయ్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న సమయంలో ఒడిశా రాష్ట్రం పొట్టంగి తహసీల్దార్ దేవేంద్రసింగ్ అభ్యంతరం చెప్పారు. ‘ఇది ఒడిశా గ్రామం.. ఇక్కడెలా ఏపీ వైద్యశిబిరం నిర్వహిస్తారు.’ అని ప్రశ్నించారు. వైద్యశిబిరం నిలిపేసి వెళ్లిపోవాలని, లేకుంటే పోలీసులను పిలవాల్సి వస్తుందన్నారు. తమ ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ఇక్కడకు వచ్చామని ఆయనకు వైద్యుడు అజయ్ వివరించారు. ఇరు రాష్ట్రాల్లో తమ గ్రామాలున్నందున ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా వైద్యసేవలు అందించాల్సి ఉందని తెలిపారు. దీంతో ఒడిశా అధికారి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏపీ 104 వాహన వైద్యశిబిరాన్ని గంజాయిభద్ర, కొఠియాలో నిర్వహించి 52 మందికి వైద్యసేవలందించారు.