Cowshed… ఇది గోశాలే..
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:07 AM
This is a Cowshed… గిరిజన ప్రాంతాల్లో పాడిసంపదను ప్రోత్సహించేం దుకు నిర్మించిన గోశాలలు నిరూపయోగంగా మారాయి. అవగాహన లేక కొంతమంది వాటిని వేరే అవసరాలకు వినియోస్తున్నారు. పశువులను ఆరుబయట ఉంచి గోశాల షెడ్డుల్లో కర్రలు, ఇతరాత్ర వస్తువులను భ ద్రపరుచుకోగా.. మరికొన్నిచోట్ల దుస్తులు ఆరబెడుతున్నారు.
సీతంపేట రూరల్, ఆగస్టు25(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో పాడిసంపదను ప్రోత్సహించేం దుకు నిర్మించిన గోశాలలు నిరూపయోగంగా మారాయి. అవగాహన లేక కొంతమంది వాటిని వేరే అవసరాలకు వినియోస్తున్నారు. పశువులను ఆరుబయట ఉంచి గోశాల షెడ్డుల్లో కర్రలు, ఇతరాత్ర వస్తువులను భ ద్రపరుచుకోగా.. మరికొన్నిచోట్ల దుస్తులు ఆరబెడుతున్నారు. బొండి, గోరపాడు గ్రామాల్లో నిర్మించిన గోశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. వాటి నిర్వహణపై పర్యవేక్షణ కొరవడగా గోశాల పథకానికి ఎంపిక చేసిన రైతులకు ఇంకా పశువులను అందించకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై పశుసంవర్థక శాఖ ఏడీ శ్రీని వాసరావును వివరణ కోరగా .. ‘మండలంలో నిర్మించిన గోశాల పథకానికి సంబంధించిన లబ్ధి దారులు ఇంకా వారి వాటా కింద నగదు జమచేయలేదు. ఇప్పటికే పది గోశాలలను వినియో గంలో ఉన్నాయి. మిగిలినవి కూడా త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం.’ అని తెలిపారు.