Share News

This is a conspiracy of YSRCP leaders. ఇది వైసీపీ నాయకుల చిచ్చు

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:34 AM

This is a conspiracy of YSRCP leaders. అది ప్రశాంతంగా ఉండే గ్రామం. రెండు ప్రధాన పార్టీల వర్గాలు ఉన్నా.. పండుగలు ప్రశాంతంగా జరుపుకునేవారు. ఎలాంటి గొడవలకు తావిచ్చేవారు కాదు. ఆదివారం కూడా దేవీ నిమజ్జనోత్సవం తొలుత టీడీపీ వర్గీయులు పూర్తి చేశారు. ఆ తర్వాత వైసీపీ నిమజ్జనోత్సవంలోనే గొడవ మొదలైంది. కొందరు ఆ పార్టీ నాయకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాన్ని కాలువలో తోసేశారు.

This is a conspiracy of YSRCP leaders. ఇది వైసీపీ నాయకుల చిచ్చు
జమ్ము గ్రామంలో ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్‌ టీం, పోలీసులు

ఇది వైసీపీ నాయకుల చిచ్చు

వారి వల్లే ప్రశాంత గ్రామంలో గొడవ

వారి తీరుతో ఇబ్బందులు పడుతున్నాము

ఆ పార్టీ సానుభూతి పరులకూ ఇక్కట్లు

జమ్ము గ్రామస్థుల ఆవేదన

దాడి ఘటనపై లోతుగా పోలీసుల దర్యాప్తు

విశాఖపట్నం నుంచి ఫోరెన్సిక్‌ టీం రాక.. పరిశీలన

అది ప్రశాంతంగా ఉండే గ్రామం. రెండు ప్రధాన పార్టీల వర్గాలు ఉన్నా.. పండుగలు ప్రశాంతంగా జరుపుకునేవారు. ఎలాంటి గొడవలకు తావిచ్చేవారు కాదు. ఆదివారం కూడా దేవీ నిమజ్జనోత్సవం తొలుత టీడీపీ వర్గీయులు పూర్తి చేశారు. ఆ తర్వాత వైసీపీ నిమజ్జనోత్సవంలోనే గొడవ మొదలైంది. కొందరు ఆ పార్టీ నాయకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాన్ని కాలువలో తోసేశారు. ఈ ఘటనలు గ్రామస్థులను ఉలిక్కిపడేటట్లు చేశాయి. ప్రశాంతంగా ఉండే ఊరిలో చిచ్చు పెట్టారని వైసీపీ నాయకుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పోలీసులు కూడా ఈ ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు దాడి చేశారు? ఎవరు ప్రోత్సహించారు? కీలక వ్యక్తులు ఎందరున్నారు? దాడిలో ఎందరు పాల్గొన్నారు?.. ఇలా అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.

గుర్ల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గుర్లలో జరిగిన ఘటనలకు వైసీపీ నాయకులే కారణమని ఆ గ్రామస్థులు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చు పెట్టారని విమర్శించారు. వైసీపీ నాయకుల కారణంగా తమలాంటి వారు కూడా ఇబ్బంది పడుతున్నామని ఆ పార్టీ సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో ఆదివారం రాత్రి దేవీ నిమజ్జనం సందర్భంగా ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ, వైసీపీ వర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోగా.. ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. అయినా ఇరువర్గాలు గొడవకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులపై వైసీపీ వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ కేసుకు సంబంధించి చీపురుపల్లి సీఐ శంకరరావు గ్రామానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తుండగా.. వైసీపీ సర్పంచ్‌ ప్రోద్బలంతో ఆ పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనంపై రాళ్ల దాడికి దిగారు. పోలీసు అధికారులు ఉన్న వాహనాన్ని కాలువలోకి తోసేశారు. అనంతరం వారిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేశారు.

దాడి ఘటనపై పోలీసుల సీరియస్‌

పోలీసులపై వైసీపీ నాయకుల దాడిని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. జమ్ము గ్రామంలో మంగళవారం సీఐ శంకరరావు, ఎస్‌ఐ నారాయణరావుతో పాటు ఫోరెన్సిక్‌ టీం సభ్యులు పర్యటించారు. కారు అద్దాలుపగిలిన ఘటన వద్ద పరిశీలించారు. అలాగే గ్రామంలోకి పోలీసులు వెళ్లారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు. ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కాగా వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా తీసుకున్న పోలీసులు.. కేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నారు. దాడి కేసుల దర్యాప్తు అధికారి అయిన చీపురుపల్లి సీఐ శంకరరావు సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు ఫోరె న్సిక్‌ నిపుణులను తీసుకువచ్చారు. విశాఖపట్నం నుంచి వచ్చిన వీరు జమ్ము గ్రామానికి వెళ్లి కీలకమైన ఆధారాలను సేకరించారు. ఈ కేసుల్లో ఇప్పటికే 20 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం సెంట్రల్‌ జైలుకు పంపించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని, ఈ రెండు కేసులలో ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సీఐ తెలిపారు.

నిర్మానుష్యంగా గ్రామం

వైసీపీ నాయకుల దుశ్చర్యతో జమ్ము గ్రామం నిర్మానుష్యంగా మారింది. ఎవరూ కూడా ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. మహిళలు, చిన్న పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. చాలావరకు పురుషులు ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. భయంతో చాలామంది వారి బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. గ్రామంలో కొన్నిచోట్ల వృద్ధులు కూర్చుని ఘటన గురించి చర్చించుకోవడం కనిపించింది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వైసీపీ నాయకులు చిచ్చు పెట్టారని, వారి వల్లే గొడవ జరిగిందని వారు అన్నారు. గ్రామంలోకి వచ్చిన పోలీసులపై దాడి చేయడం మంచికాదని వారు అభిప్రాయపడ్డారు. నాయకుల కారణంగా అమాయకులైన వైసీపీ సానుభూతిపరులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు. గొడవల వల్ల గ్రామానికి ఒరిగేదేమీలేదంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని, దేవి నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకునే వారమని అన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకుల కారణంగా తమ గ్రామానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Oct 08 , 2025 | 12:34 AM