This is a Canal ఇది కాలువే..
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:38 PM
This is a Canal ఇది జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువ పరిస్థితి. గరుగుబిల్లి మండలంలోని కొత్తవలస సమీపంలో కొన్నాళ్లుగా ఇలానే దర్శనమిస్తోంది. ఖరీఫ్‌కు ముందుగా కాలువల పరిధిలోని గుర్రపు డెక్కను తొలగించలేదు. దీంతో సాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది.
గరుగుబిల్లి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఇది జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువ పరిస్థితి. గరుగుబిల్లి మండలంలోని కొత్తవలస సమీపంలో కొన్నాళ్లుగా ఇలానే దర్శనమిస్తోంది. ఖరీఫ్‌కు ముందుగా కాలువల పరిధిలోని గుర్రపు డెక్కను తొలగించలేదు. దీంతో సాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. శివారు ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా.. ఎవరూ స్పందించడం లేదని వారు వాపో తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జంఝావతి కాలువల నుంచి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.