తిరిగొచ్చాయ్!
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:18 PM
They’re Back! గురుగుబిల్లి మండలానికి గజరాజులు తిరిగొచ్చాయి. గత కొద్ది రోజులుగా పార్వతీపురం, కొమరాడ మండలాల్లో సంచరించిన ఏనుగులు ఆదివారం తెల్లవారుజామున జియ్యమ్మవలస మండలం సంతోషపురం పంచాయతీ ఖడ్గవలస రహదారిలో హల్‌చల్ చేశాయి. అటవీ శాఖ సిబ్బంది, ట్రాకర్లు స్పందించి.. పిట్టలమెట్ట వైపు వాటిని మళ్లించారు.
గరుగుబిల్లి, నవంబరు2(ఆంధ్రజ్యోతి): గురుగుబిల్లి మండలానికి గజరాజులు తిరిగొచ్చాయి. గత కొద్ది రోజులుగా పార్వతీపురం, కొమరాడ మండలాల్లో సంచరించిన ఏనుగులు ఆదివారం తెల్లవారుజామున జియ్యమ్మవలస మండలం సంతోషపురం పంచాయతీ ఖడ్గవలస రహదారిలో హల్‌చల్ చేశాయి. అటవీ శాఖ సిబ్బంది, ట్రాకర్లు స్పందించి.. పిట్టలమెట్ట వైపు వాటిని మళ్లించారు. అయితే ఏనుగులు పంట పొలాల్లో సంచరించడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. వరి కోతల సమయం కావడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం గజరాజులు పిట్టలమెట్ట, నాగూరు గ్రామాల మధ్యలో సంచరిస్తున్నాయి. వాటిని వేరే ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు , గ్రామస్థులు కోరుతున్నారు.