Share News

enugulu కదలవు.. వదలవు!

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:38 PM

They won’t move… they won’t give up! కొమరాడ మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గత రెండు రోజులుగా సోమినాయుడువలస వలసలోనే సంచరిస్తున్న ఏనుగులు ఆదివారం కూడా ఆ గ్రామ పరిసరాల్లోనే హల్‌చల్‌ చేశాయి. చేతికందొచ్చిన టమాటా, పత్తి, అరటి, వరి పంటలను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

enugulu కదలవు.. వదలవు!
వరి పొలంలో సంచరిస్తున్న ఏనుగులు

కొమరాడ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలాన్ని గజరాజులు వీడడం లేదు. గత రెండు రోజులుగా సోమినాయుడువలస వలసలోనే సంచరిస్తున్న ఏనుగులు ఆదివారం కూడా ఆ గ్రామ పరిసరాల్లోనే హల్‌చల్‌ చేశాయి. చేతికందొచ్చిన టమాటా, పత్తి, అరటి, వరి పంటలను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాత్రి వేళల్లో అర్తాం కొండల్లో ఉంటున్న ఏనుగులు సాయంత్రం వేళల్లో పంట పొలాల్లోకి చేరుకుని నాశనం చేస్తున్నాయి. కాగా పంట నష్టం నమో దుకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు తుఫాన్‌ గుబులు అన్నదాతలను వెంటాడుతోంది. ఏదేమైనా తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 11:38 PM