Share News

వరుస దొంగతనాల కేసును ఛేదించారు

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:16 AM

మండలంలోని బానాది గ్రామంలో ఐదు దేవాలయాల్లో ఈనెల 13న జరిగిన వరుస దొంగతనాల కేసును వల్లంపూడి పోలీసులు ఛేదించారు.

 వరుస దొంగతనాల కేసును ఛేదించారు

వేపాడ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని బానాది గ్రామంలో ఐదు దేవాలయాల్లో ఈనెల 13న జరిగిన వరుస దొంగతనాల కేసును వల్లంపూడి పోలీసులు ఛేదించారు. మంగళవారం వల్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సుదర్శన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్‌.కోట రూరల్‌ సీఐ ఎల్‌.అప్పలనాయుడు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం కృష్ణరాయుడుపేట జంక్షన్‌ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్ప దంగా తిరుగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ సుదర్శన్‌ తన సిబ్బందితో మాటు వేసి పట్టుకున్నారు. ఆ వ్యక్తిని విచారించగా.. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెందుర్తి గ్రామానికి చెందిన పెందుర్తి నాగరాజుగా తెలిపా డు. బానాది గ్రామంలోని ఐదు దేవాలయాలో హుండీల చోరీకి తానే కారణమని అంగీకరించాడు. కార్యసిద్ధి వినాయకుని దేవాలయం హుండీలో రూ.3101, శివాలయం హుండీలో రూ.20,194, ఆంజనేయస్వామి దేవాలయం హుండీలో రూ.2,247, పరదేశమ్మ గుడి హుండీలో రూ.15,538, మరిడిమాంబ గుడి హుండీ లో రూ.1055.. మొత్తం రూ.42,135 నగదు దొంగిలించినట్టు నాగరాజు అంగీకరిం చాడు. ఎస్‌ఐ సుదర్శన్‌, సిబ్బందితో కలిసి ఈ చోరీ సొత్తును స్వాధీనం చేసుకు ని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నాగరాజుపై కేసు నమో దు చేసి, అరెస్టు చేశారు. అయితే ఇదే నాగరాజుపై గతంలో కూడా పలు హుండీల దొంగతనాల కేసుల్లో అరెస్టు అయ్యాడు. సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈనెల 10వ తేదీన రాత్రి ఒక గుడిలో చొరబడి రూ.10,170 దొంగతనం చేసినట్టు నాగరాజు ఒప్పుకున్నాడు. ఈసందర్భంగా పది రోజుల్లో కేసును ఛేదించిన వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ను, సిబ్బందిని సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:16 AM