They are there...! వారక్కడే...!
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:02 AM
They are there...! వేపాడ మండల పరిధిలోని ఓ గ్రామంలో పనిచేసిన వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఏఎన్‌ఎంకు జిల్లాలోని వేరే మండలానికి రెండేళ్లక్రితం బదిలీ అయింది. విధులు ఇక్కడ నిర్వహిస్తున్నప్పటికీ ఆ ఏఎన్‌ఎం జీతభత్యాలన్నీ వేపాడ మండలంలో పొందుతోంది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం సీనియార్టీకి అక్కడి సమయాన్నే పరిగణిస్తున్నారు. ఈ ఏఎన్‌ఎంకు బదిలీ జరిగినప్పటికే ఎనిమిదేళ్ల సీనియార్టీ మించిపోయింది. ఇప్పుడు పదేళ్లకు పైబడిన సీనియార్టీ ఉన్నప్పటికీ ఈమె బదిలీ కోరుకుంటే రిక్వస్ట్ (అభ్యర్ధన) చేసుకోవాలి. లేదంటే ప్రస్తుతం చేస్తున్న ప్రదేశంలో కొనసాగాల్సిందే.
వారక్కడే...!
జీతభత్యాలు డ్రాచేసే ప్రదేశం ఆధారంగా సీనియార్టీ
పని చేసే ప్రదేశం నుంచి బదిలీ కోరుకుంటే అభ్యర్థించాల్సిందే
వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల
గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్‌ఎం బదిలీలపై స్పష్టత కరువు
శృంగవరపుకోట, జూన్ 2 (ఆంధ్రజ్యోతి):
- వేపాడ మండల పరిధిలోని ఓ గ్రామంలో పనిచేసిన వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఏఎన్‌ఎంకు జిల్లాలోని వేరే మండలానికి రెండేళ్లక్రితం బదిలీ అయింది. విధులు ఇక్కడ నిర్వహిస్తున్నప్పటికీ ఆ ఏఎన్‌ఎం జీతభత్యాలన్నీ వేపాడ మండలంలో పొందుతోంది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం సీనియార్టీకి అక్కడి సమయాన్నే పరిగణిస్తున్నారు. ఈ ఏఎన్‌ఎంకు బదిలీ జరిగినప్పటికే ఎనిమిదేళ్ల సీనియార్టీ మించిపోయింది. ఇప్పుడు పదేళ్లకు పైబడిన సీనియార్టీ ఉన్నప్పటికీ ఈమె బదిలీ కోరుకుంటే రిక్వస్ట్ (అభ్యర్ధన) చేసుకోవాలి. లేదంటే ప్రస్తుతం చేస్తున్న ప్రదేశంలో కొనసాగాల్సిందే.
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సీహెచ్‌ఓ, ఎంపీహెచ్‌ఈఓ, పీహెచ్‌ఎన్ (ఎన్‌టీ), హెచ్‌ఈ, ఎంపీహెచ్‌ఎస్ (ఎఫ్), ఎంపీహెచ్‌ఎస్ (ఎం), సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎల్‌డీ, కంప్యూటర్ కేటగిరిలోని ఉద్యోగులందరికీ ఇదే నిబంధనను వైద్య ఆరోగ్య శాఖ వర్తింపచేసింది. వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న రెగ్యూలర్ ఉద్యోగుల బదిలీలకు శనివారం ఈశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ శాఖలో పని చేస్తున్న మిగిలిన ఉద్యోగులకు మాత్రం ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయితే తప్పనిసరి బదిలీ ఉంటుంది. రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు రిక్వస్ట్ (అభ్యర్థన) బదిలీలకు అర్హులు. బదిలీలను కోరుకొనే ఉద్యోగులంతా ఐదు ప్రాంతాలను ప్రాధాన్యత క్రమంలో సూచించాలి. ఒక ప్రాంతానికి ఒకటి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఎంపిక చేసుకున్నప్పుడు సీనియార్టీ ఆధారంగా బదిలీలో ప్రాధాన్యం ఇస్తారు. ఖాళీల లభ్యతను బట్టి పోస్టింగ్ కేటాయింపు జరుగుతుంది. ప్రభుత్వం మే 16 నుంచి జూన్ 2వరకు బదిలీలకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వైద్య ఆర్యోగ్య శాఖకు చెందిన బదిలీలకు జూన్ 19 వరకు గడువు ఇచ్చారు. జూన్ 20 నుంచి నిషేధం అమల్లోకి వస్తుంది.
ఫ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చిన బదిలీ షెడ్యూల్ ప్రకారం కేడర్ల ఖాళీలు, ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల జాబితాలను ప్రదర్శించాలి. కానీ ఇంత వరకు ఎక్కడా ప్రదర్శించలేదు.
సచివాలయ ఏఎన్‌ఎంల బదిలీలపై స్పష్టత కరువు
గ్రామ వార్డు సచివాలయాల ఏఎన్‌ఎంలు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పని చేస్తున్నారు. వీరందరికీ పంచాయతీరాజ్ శాఖకు చెందిన కార్యదర్శులు డీడీవోలుగా వ్యవహరిస్తున్నారు. విధులు మాత్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెబుతుంది. కాగా గ్రామ, వార్డు సచివాలయ హేతుబద్ధీకణ ప్రక్రియ ఏఎన్‌ఎంల బదిలీలకు అడ్డింకి కాదని అంతా అనుకున్నారు. కానీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఎక్కడా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎంల బదిలీల ప్రస్తావన తేలేదు.
---------------