పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:46 PM
రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా జగన్ అండ్ కో అడ్డుకుం టోందని, పారిశ్రామికవేత్తలను వెనక్కి పంపించడానికి వారు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆరోపించారు.
చీపురుపల్లి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా జగన్ అండ్ కో అడ్డుకుం టోందని, పారిశ్రామికవేత్తలను వెనక్కి పంపించడానికి వారు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి కోసం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పనులన్నీ తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పడం ప్రజలపై వారికున్న అభిమా నాన్ని నిరూపిస్తోందన్నారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్న కంపెనీలను వారు భయ పెడుతున్నారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంటు కోసం నోరు మెదపని ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఇప్పుడు మాట్లాడడమేమిటని కళా ప్రశ్నించారు. అనంతరం వచ్చే నెల 15 వరకూ గ్రామాల్లో నిర్వహించనున్న పశు వైద్య శిబిరాలకు సంబంధించి పోస్టర్‌ను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రౌతు కామునాయు డు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, పైల బలరాం పాల్గొన్నారు.