They Are Moving Away! తరలివెళ్తున్నారు!
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:38 PM
They Are Moving Away! ఓ కాంట్రాక్టర్ నుంచి భారీగా లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ శ్రీనివాస్‌ను సంబంధిత అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ప్రధానంగా చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహించిన కాలంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబుక్స్‌లో తేదీలు మార్చడం, తదితర అక్రమాలు జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం.
పార్వతీపురం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఓ కాంట్రాక్టర్ నుంచి భారీగా లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ శ్రీనివాస్‌ను సంబంధిత అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ప్రధానంగా చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహించిన కాలంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబుక్స్‌లో తేదీలు మార్చడం, తదితర అక్రమాలు జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం. దీనికి సంబంధించి పలువురు జిల్లా ఇంజనీరింగ్ శాఖాధికారులను ఏసీబీ అధికారులు పిలిపించి వివరణలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో కొంతమంది అధికారులు ఏసీబీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది.