Share News

elephants హడలెత్తిస్తున్నాయ్‌!

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:32 PM

They are making a fuss గరుగుబిల్లి మండలం దళాయివలస, ఉల్లిభద్ర గ్రామాల నడుమ గజరాజులు సంచరిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతవాసులు హడలెత్తిపోతున్నారు. రెండు రోజులుగా గొట్టివలస సమీపంలో హల్‌చల్‌ చేసిన ఏనుగులు ఆదివారం ఆ రెండు గ్రామాల మధ్య ప్రత్యక్షమయ్యాయి.

elephants హడలెత్తిస్తున్నాయ్‌!
దళాయివలస సమీప తోటల్లో సంచరిస్తున్న గజరాజులు

  • గ్రామస్థులు, రైతుల బెంబేలు

గరుగుబిల్లి, జూన్‌1(ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలం దళాయివలస, ఉల్లిభద్ర గ్రామాల నడుమ గజరాజులు సంచరిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతవాసులు హడలెత్తిపోతున్నారు. రెండు రోజులుగా గొట్టివలస సమీపంలో హల్‌చల్‌ చేసిన ఏనుగులు ఆదివారం ఆ రెండు గ్రామాల మధ్య ప్రత్యక్షమయ్యాయి. దీంతో రైతులు ఖరీఫ్‌ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లలేక పోతున్నారు. మరోవైపు గజరాజులు ఎక్కడ గ్రామాల్లోకి వస్తాయోనని ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా గజరాజులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్లు చర్యలు చేపడుతున్నారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడరాదని గ్రామస్థులను హెచ్చరిస్తున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 11:32 PM