Share News

నిర్మాణాల్లో పురోగతి ఉండాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:08 AM

జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా చేపడుతున్న గృహ నిర్మా ణాల్లో ప్రతి వారం పురోగతి కనిపించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

 నిర్మాణాల్లో  పురోగతి ఉండాలి

-చలివేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేయాలి

-కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా చేపడుతున్న గృహ నిర్మా ణాల్లో ప్రతి వారం పురోగతి కనిపించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించా రు. పీజీఆర్‌ఎస్‌, హౌసింగ్‌, నరేగా, తాగునీటి సమస్య లు, గ్రామ/వార్డు సచివాలయాల కార్యకలాపాలు, పింఛన్ల పంపిణీ, పాజిటివ్‌ పబ్లిక్‌ పర్సెప్షన్‌ తదితర అంశాలపై కలెక్టర్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పీఎం జన్మన్‌ కింద నిర్మిస్తున గృహాలకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు వరకు అదనంగా మంజూరు చేస్తున్నప్పటికీ ప్రగతి కనిపించడం లేదన్నారు. ‘ఈ పథకానికి నిధుల కొరత కూడా లేదు. చేసిన పనులకు బిల్లులు కూడా త్వరగా చెల్లిస్తున్నాం. లేఅవుట్లలో నిర్మిస్తున్న గృహాల్లో ఆర్‌సీ, ఆర్‌ఎల్‌ స్టేజీలో 3,149 గృహాలు ఉన్నాయి. వాటిపై మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఏఈఈలు ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రతి మండలంలో వారంవారం పురోగతి ఉండాలి. ప్రతివారం వంద గృహాలకు పైగా ప్రారంభమయ్యేలా చూడాలి. నిర్మాణాలన్నీ ఆగస్టు నాటికి పూర్తి కావాలి. జిల్లాలో రోజురోజుకూ ఉష్ణో గ్రతలు పెరుగుతు న్నాయి. అన్ని చోట్ల చలివేం ద్రాలు ఏర్పాటు చేయాలి. పని ప్రదేశాలు, ఉపాధి హామీ పనులు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్‌ తదితర ప్రదేశాల్లో చలివేంద్రాలు కచ్చితంగా ఉండాలి. పింఛనుదారులు అసంతృప్తి చెందకుండా పింఛన్ల పంపిణీ రోజున మండల ప్రత్యేక అధికారులు పాల్గొనాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెరువు గట్ల పనులతో పాటు ఫాంపాండ్స్‌కు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని అన్నారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, సబ్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:08 AM