తూకాల్లో తేడాలు ఉండకూడదు
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:52 PM
బేకరీ, స్వీట్స్ దుకాణాలు తూకం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని... అట్టపెట్టె బరువును మినహాయించి నికర బరువును మాత్రమే చూపించాలని, ఎలకా్ట్రనిక్ కాటాల్లో తూకం మొదలు పెట్టేముందు జీరో రీడింగ్ తప్పనిసరిగా ఉండాలని లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి.మనోహర్ అన్నారు.
విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): బేకరీ, స్వీట్స్ దుకాణాలు తూకం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని... అట్టపెట్టె బరువును మినహాయించి నికర బరువును మాత్రమే చూపించాలని, ఎలకా్ట్రనిక్ కాటాల్లో తూకం మొదలు పెట్టేముందు జీరో రీడింగ్ తప్పనిసరిగా ఉండాలని లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బి.మనోహర్ అన్నారు. బుధవారం తోటపాలెం వద్ద లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో బేకరీ, స్వీట్స్ షాపు యాజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలతల విషయాల్లో కచ్చితంగా నియమాలు పాటించాలన్నారు. ప్యాకేజీ ఆహార పదార్థాలపై లేబుల్, ముద్రణ వంటి వివరాలు స్పష్టంగా ఉండాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కంట్రోలర్ రంగారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు ఉమాసుందరి, సిబ్బంది పాల్గొన్నారు.