Share News

ఐపీఎల్‌లో జిల్లా ప్రాతినిథ్యం ఉండాలి

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:59 PM

ఐపీఎల్‌లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

ఐపీఎల్‌లో జిల్లా ప్రాతినిథ్యం ఉండాలి
క్రీడాకారుడికి ప్రోత్సాహకాన్ని అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఐపీఎల్‌లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆది వారం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ ్వర్యంలో జోనల్‌, రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వందేళ్ల క్రితం పక్క జి ల్లాల వారితో పాటు జిల్లాలోని పేదలకు విద్యనందించిన చరిత్ర పూస పాటి అశోక్‌ గజపతిరాజు కుటుంబానిది అన్నారు. రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా సౌకర్యాలు కల్పించిన ఘనత కూడా ఆ కుటుంబానిదేనన్నారు. మైదానం, క్రీడా సౌకర్యాలను వినియోగించుకుని ప్రతిభ గల క్రీడాకారులుగా తయారు కావాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ ఐదేళ్లల్లో క్రీడలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అందుకే ఈ మైదానానికి ఐదేళ్లు రాలేదన్నారు. కొండ వెలగాడలో రూ.50 లక్షలతో అంతర్జాతీయ సౌకర్యాలతో జిమ్‌ నిర్మిస్తే ఆ జిమ్‌లోని మెటీరియల్‌ను తీసుకువెళ్లిపోయారన్నారు. ఎన్టీఆర్‌ ముఖ్యమం త్రిగా క్రీడలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారన్నారు. ఎంపీ కలిశెట్టి అ ప్పలనాయుడు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం అను భవిస్తున్నామంటే అది అశోక్‌ గజపతిరాజు చలవేనన్నారు. చరిత్ర కలిగిన మైదానం విజ్జీ క్రీడామైదానమని దానిపేరు నిలబెట్టే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు రాంబాబు, క్రీడాకారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:59 PM