విద్యా విధానంలో మార్పులు రావాలి
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:06 AM
విద్యా విధానంలో మార్పులు రావాలని, ప్రతి విద్యార్థి బాగా చదవాలని విజయనగరం ఆర్జేడీ విజయ భాస్కర్ కోరారు.
గుర్ల, డిసెంబరు 24 ( ఆంధ్రజ్యోతి):విద్యా విధానంలో మార్పులు రావాలని, ప్రతి విద్యార్థి బాగా చదవాలని విజయనగరం ఆర్జేడీ విజయ భాస్కర్ కోరారు. బుధవారం గుర్ల ఉన్నత పాఠ శాలను తనిఖీచేశారు. ఈసందర్భంగా మాట్లాడు తూ విద్యార్థులకు రుచికరమై మధ్యాహ్న భోజ నం అందజేయాలని కోరారు. మరుగుదొడ్లు, తాగునీరు సౌకర్యాలు బాగుండాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజు ల యాక్షన్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నా రు. స్లిప్ టెస్టు పేపర్లను వెరిపై చేసి వాల్యు యేషన్ చేయకూడదని, కరక్షన్ చేయాలని సూ చించారు. ఆయన వెంట ఎంఈవోలు భానుప్రకా ష్,శ్రీనివాసరావు, హెచ్‌ఎం తదితరులు ఉన్నారు.
ఫ గరివిడి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): గరివిడిలోని కేజీబీవీ పాఠశాలను ఆర్జేడీ విజయభాస్కర్ బుధవారం తనిఖీ చేశారు. పదో తరగతికి సంబంధించి వంద రోజుల ప్రణాళిక ప్రకారం అమలవుతున్న పరీక్ష పత్రాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా వండి వడ్డించాలన్నారు. పదోత్రరగతి విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవాటుచేసుకోవాలని, జ్ఞానాన్ని పెంచు కోవాలన్నారు. ఆయన వెంట ఎంఈవో-2 పి.అప్పన్న, హెచ్‌ఎం ఈ.ధనలక్ష్మి ఉన్నారు.
యాక్షన్ ప్లాన్‌ను అమలుచేయాలి
జామి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వోన్నతపాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల కోసంవందరోజుల యాక్షన్ ప్లాన్‌ను ఉపాధ్యాయులు అమలు చేయాలని మండల ప్రత్యేకాధికారి శారదదేవి కోరారు. బుధవారం కుమరాం ఉన్నతపాఠశాలను ఎంఈవో గంగరాజు ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో చర్చించి జామి మండలంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాఽధించాలని కోరారు.
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
గజపతినగరం, డిసెంబరు24 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యతపై రాజీపడవద్దని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని మండల ప్రత్యేకాధికారి ఎం.రమేష్ తెలిపారు. బుధవారం మండలంలోని జిన్నాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన సంబందిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట హెచ్‌ఎం సన్యాసినాయుడు ఉన్నారు.
విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి
గుర్ల,డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి):విద్యాభివృద్ధిపై దృష్టిసారించాలని మెరకముడిదాం ఏఎంసీ వైస్‌చైర్మన్ దాసరి శివప్రసాద్ కోరారు.ఈమేరకు విజయనగరంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి, విద్యాభివృద్ధి కోసం ఎమ్మెల్సీ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. వెనుకబడిన జిల్లాను, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.