Share News

జిల్లాలో నకిలీ మద్యం లేదు

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:01 AM

ఉమ్మడి జిల్లాలో ఎక్కడా నకిలీ మద్యం ఆనవాళ్లు కనిపించలేదని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వై.శ్రీనివాసచౌదరి అన్నారు.

 జిల్లాలో నకిలీ మద్యం లేదు
మాట్లాడుతున్న డీసీ శ్రీనివాసచౌదరి

-సురక్ష యాప్‌తో నాణ్యత తెలుసుకోవచ్చు

- ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసచౌదరి

విజయనగరం క్రైం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఎక్కడా నకిలీ మద్యం ఆనవాళ్లు కనిపించలేదని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వై.శ్రీనివాసచౌదరి అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాణ్యమైన మద్యం అందించేందుకు ప్రభుత్వం సురక్ష మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. మద్యం బాటిల్‌ కొనుగోలు చేసేటప్పుడు యాప్‌ ద్వారా నాణ్యతను తె లుసుకోవచ్చునని అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 225 మద్యం షాపులు, 26 బార్లలో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో ఎక్కడా నకిలీ మద్యం దాఖలాలు కనిపించలేదన్నారు. నాణ్యమైన మద్యం విక్రయించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో విస్తృతంగా తనిఖీలు చేపడతున్నామన్నారు. నకిలీ మద్యానికి జిల్లాలో తావులేదని అన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌ బి.శ్రీనాథుడు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:01 AM