Share News

చీపురుపల్లిలో చోరీ

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:59 PM

చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయ పురంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

చీపురుపల్లిలో చోరీ

చీపురుపల్లి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయ పురంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో పది తులాల బంగా రం, కిలోన్నర వెండి, రూ.2.5 లక్షలు చోరీకి గురయ్యాయి. వివరాలు ఇలా ఉన్నా యి. ఆంజనేయపురంలోని వంగపల్లిపేట రోడ్డులో ఒమ్మి సురేష్‌ అనే ఉపాధ్యా యుడు నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఇంటికి తాళం వేసి, తన భార్యతో కలిసి రాజాం సమీపంలోని డోలపేటలో ఓ వివాహ కార్యక్ర మానికి వెళ్లారు. అదే రోజున రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. హాల్లోని కిటికీకి ఉన్న ఇనుప చట్రం ఊడి ఉండడాన్ని గమనించారు. ఇంట్లో ఎవరో ఉన్నారని అనుమానించిన ఆయన లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. లోపలి గదికి గడియ పెట్టి ఉండ డంతో, అనుమానం మరింత బలపడింది. వెంటనే సమీపంలో ఉన్న మిత్రులు, సోదరునికి సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత ఇంటి వెనుక వైపు నకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే అలికిడి కావడంతో దొంగలు ఇంటి పెరటివైపున ద్వారం తెరుచుకుని ప్రహరీ దూకి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ దామోదరరావు ఇంటి పరిసరాలను పరిశీలించారు. విజయనగరం నుంచి క్లూస్‌ టీం వచ్చి, పరిశీలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:59 PM