చికిత్స పొందుతూ మహిళ మృతి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:54 PM
కడుపునొప్పి తాళలేక ఆత్మ హత్యాయత్నానికి పాల్పడిన టిటుకుపాయి పంచాయతీ పరిధిలోని అంబలగండి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి(36) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
సీతంపేట రూరల్, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): కడుపునొప్పి తాళలేక ఆత్మ హత్యాయత్నానికి పాల్పడిన టిటుకుపాయి పంచాయతీ పరిధిలోని అంబలగండి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి(36) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. దోనుబాయి ఎస్‌ఐ మస్తాన్ అందించిన వివరాల మేరకు.. అంబలిగండి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి కొంతకాలంగా కడుపునొప్పి సమస్య తో బాధపడుతోంది. ఈనెల 15న కడుపునొప్పి తాళలేక లక్ష్మి గడ్డిమందు తాగిం ది. గమనించిన భర్త శోభన్‌బాబు భార్య లక్ష్మిని సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం లక్ష్మి మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీనిపై ఎస్‌ఐ మస్తాన్ కేసు నమోదుచేశారు.