పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 21 , 2025 | 12:13 AM
పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.
గుమ్మలక్ష్మీపురం, మే 20 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురంలో కురుపాం నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమా లలు వేసి, నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం నిరం తరం పరితపించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈసందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 14 అంశాలను తీర్మానం చేశారు. కురుపాం నియోజకవర్గ పరిశీలకుడు ఆరేటి మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేను వేదికపై సన్మానించారు.
బొబ్బిలి రూరల్: టీడీపీకి పునాది, బలం, శక్తి, కార్యకర్తలేనని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. బొబ్బిలి కోటలో మంగళవారం మినీ మహానా డు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాల లు వేసి, నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు అల్లాడ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.