Share News

రైతుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:56 PM

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రజాప్రతిని ధులు, అధికారులు తెలిపారు. శనివారం జిల్లాలో పలు చోట్ల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న-మీకోసం వారోత్సవాలను అధికారులు, కూటమి నాయకులు నిర్వహించారు.

 రైతుల సంక్షేమమే ధ్యేయం
శృంగవరపుకోట: సోంపురంలో రైతన్నా-మీకోసం కరపత్రాలను ప్రదర్శిస్తున్న ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి :

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రజాప్రతిని ధులు, అధికారులు తెలిపారు. శనివారం జిల్లాలో పలు చోట్ల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న-మీకోసం వారోత్సవాలను అధికారులు, కూటమి నాయకులు నిర్వహించారు.

ఫశృంగవరపుకోట (వేపాడ), నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వ్యవసా యాన్ని లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. వేపాడ మండలంలోని సోం పురంలో జరిగిన రైతన్నా మీకోసం ఆమె మాట్లాడుతూ అధిక లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.కార్యక్రమం లో ఏవో ఎం.స్వాతి, గిరిజన కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి లక్ష్మి, టీడీపీ నాయకులు గొర్రిపాటిరాము, బుద్ద అప్పలనాయుడు, మల్ల వెంకట రమణ, దుల్లవెంకటరావు పాల్గొన్నారు.

ఫనెల్లిమర్ల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పంటఉత్పత్తి పెంపు,మార్కెట్‌ సదుపాయాల విస్తరణ, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందజేస్తామని ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు హామీఇచ్చారు. మండలంలోని కొండవెల గాడలో జరిగిన రైతన్నా-మీ కోసం కార్యక్రమంలో రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగేదెల రాజారావు, కొండవెలగాడ టీడీపీ నాయకులు దంతులూరి అజయ్‌బాబు, మొయిద సత్యనారాయణ, కాళ్ల రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 11:56 PM