రైతుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:59 PM
రైతుల సంక్షేమమే ధ్యేయమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు రానివ్వబోమని చెప్పారు. గురువారం మండలంలోని తురకనాయు డువలస ఎస్సీవీధిలో యువకులు శ్రమదానంతో నిర్మించిన రచ్చబండ ప్రారంభిం చారు.
జియ్యమ్మవలస, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయమని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు రానివ్వబోమని చెప్పారు. గురువారం మండలంలోని తురకనాయు డువలస ఎస్సీవీధిలో యువకులు శ్రమదానంతో నిర్మించిన రచ్చబండ ప్రారంభిం చారు.అనంతరం తురకనాయుడువలస, పెదకుదమ గ్రామాల్లో రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులకు విత్త నాలు,పచ్చిరొట్టవిత్తనాలు, ఎరువుల సబ్సిడీపై ప్రభుత్వంఅందిస్తోందని, రైతులకు ఇబ్బందులు రానీయకుండా వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లుచేయాలని ఆదే శించారు.కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపీపీ బొంగు సురేష్,టీడీపీ మండలాధ్యక్షులు పల్ల రాంబా బు,ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు నందివాడ కృష్ణబాబు, వట్టిగెడ్డ ప్రాజెక్టు కమి టీ చైర్మన్ మూడడ్ల సత్యంనాయుడు, వైస్ చైర్మన్ ఎం.ప్రసాద్, డంగభద్ర సర్పంచ్ జోగి భుజంగరావు,సర్పంచ్ పోతల నాగమణి పాల్గొన్నారు.