Share News

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:40 PM

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్‌ తెలిపారు. సోమవారం మండలంలో రామతీర్థంలో అన్నదాత సుఖీభవ, రైతన్నా మీకోసం వారోత్సవాల్లో భాగంగా పర్యటించారు.కార్యక్రమంలో గేదెల రాజారావు, తాడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

 రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రేగిడి: లచ్చన్నవలసలో ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు, అధికారులు:

నెల్లిమర్ల, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్‌ తెలిపారు. సోమవారం మండలంలో రామతీర్థంలో అన్నదాత సుఖీభవ, రైతన్నా మీకోసం వారోత్సవాల్లో భాగంగా పర్యటించారు.కార్యక్రమంలో గేదెల రాజారావు, తాడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఫరేగిడి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పంటమార్పిడితో భూసారం పెరిగి రైతుకు లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ రాజాం ఏడీ చంద్రరావు, తహసీ ల్దార్‌ కృష్ణలత, ఎంపీడీవో శ్యామలాకుమారి తెలిపారు. సోమవారం మం డలంలోని లచ్చన్నవలస, చిన్నశిర్లాం, ఉంగరాడ, దేవుదళ, సంకిలిల్లో వ్యవసాయ శాఖ నిర్వహించిన రైతన్నా- మీకోసం కార్యక్రమం నిర్వహించారు.

ఫగజపతినగరం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి):మండలంలోని ఎం.వెంకటాపురం లో రైతులకు రైతన్నా-మీకోసం వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆహార భద్రత, పెట్టుబడి తగ్గించడం, మార్కెట్‌ ఆధారిత పంటలసాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు, ఏడీఏ నిర్మలజ్యోతి , డిప్యూటీ ఎంపీడీవో జనార్దనరావు, ఏవో కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫదత్తిరాజేరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ మండలాధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్‌ అన్నారు. దత్తిరా జేరులో రైతన్నా-మీకోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మిత్తిరెడ్డి లక్ష్మి, బండి కృష్ణ, లక్ష్ముంనాయుడు, ఆర్‌ఐ నారాయణరావు, వీఆర్వో బలరాం పాల్గొన్నారు.

ఫభోగాపురం, నవంబరు24(ఆంధ్రజ్యోతి): రైతులు వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని ఏవో కె.హైమావతి తెలిపారు. భోగాపురంలో రైతన్నా -మీకోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యకమ్రంలో నాయకులు కొమ్మూరుసుభోషణరావు, పల్లంట్ల జగదీష్‌, బొల్లు త్రినాథ్‌ పాల్గొన్నారు.

ఫడెంకాడ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రైతులు వ్యవసాయ రంగంలో రాణిం చినప్పుడే దేశ ఆర్థిక పురోగతి చెందుతుందని తహసీల్దార్‌ రాజారావు, ఏవో సంగీత తెలిపారు. పెదతాడివాడ, చింతలవలస, పినతాడివాడ, చొల్లంగిపేట, సింగవరం, డెంకాడ రైతు సేవా కేంద్రాల్లో రైతన్నా-మీకోసం కార్యక్రమం నిర్వహించారు.

ఫరాజాం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఒమ్మిలో సర్పంచ్‌ వంగా వెంకటరావు అధ్యక్షతన రైతన్నా-మీకోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ కె.చంద్రరావు, ఏవో చీకటి రఘునాఽథ్‌ పాల్గొన్నారు,

Updated Date - Nov 24 , 2025 | 11:40 PM