పల్లె పండుగతో గ్రామాలకు మహర్దశ
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:01 AM
పల్లెప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె పండుగ కార్యక్రమం తో పల్లెలకు మహర్దశ కానవచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పల్లెప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె పండుగ కార్యక్రమం తో పల్లెలకు మహర్దశ కానవచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని పురిటిపెంట గ్రామం వద్ద రూ.54లక్షలతో చేపట్టిన పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో జిల్లాలో రూ.500కోట్లతో పల్లె పండుగ పను లు చేపట్టగా.. ఇంతవరకు రూ.200కోట్ల పనులకు బిల్లులు చెల్లింపులు చేపట్టామన్నారు. అదే విధంగా గజపతినగరం నియోజకవర్గంలో రూ.120 కోట్లతో పను లు చేపట్టాగా రూ.60కోట్ల పనులు పూర్తి చేశారని చెప్పారు. ఈ సంక్రాంతి పండుగకు పల్లెపండగ 2.0 కార్యక్రమంలో భాగంగా రూ.30కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్టు తెలిపారు. గజపతి నగరం జాతీయ రహదారి నుంచి మెంటాడ రైల్వే గేటు వరకు రూ.54లక్షలతో వీబీ జీరామ్‌జీ నిధుల తో పనులు ప్రారంభించన్నుట్లు తెలిపారు. ఈ పనులకు పురిటిపెంట పంచాయతీలో గల డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానం చేస్తూ అదనంగా మరో రూ.46లక్షలు ఖర్చు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీదర్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు రెడ్డి పావని, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగా రునాయుడు టీడీపీ మండల అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, పార్టీ నాయకులు రామ్‌కుమార్, ప్రదీప్‌కుమార్ తోపాటు మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.