Share News

నిజాలు బయటకు వస్తున్నాయి

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:33 PM

మండలంలోని జిందాల్‌ భూముల్లో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సర్వేతో నిజాలు బయటకు వస్తున్నాయని నిర్వాసి తులు అన్నారు.

నిజాలు బయటకు వస్తున్నాయి
మాట్లాడుతున్న జిందాల్‌ నిర్వాసితులు

ఎస్‌.కోటరూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జిందాల్‌ భూముల్లో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సర్వేతో నిజాలు బయటకు వస్తున్నాయని నిర్వాసి తులు అన్నారు. 154వ రోజు శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లా డారు. గత స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నిర్వహించిన గ్రామసభలో 199 మంది రైతులు జిందాల్‌ఫై ఫిర్యాదులు చేశారన్నారు. దీనిపై విచారణ చేస్తున్నారని, ఈ తరుణంలో తమ భూములు తమ సాగులోనే ఉన్నాయన్న నిజం వెలుగులోకి రావడం సంతోషం కల్గిస్తుందన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి తమ భూములు వెనక్కి ఇవ్వాలని కోరారు.

Updated Date - Nov 15 , 2025 | 11:33 PM