ముహూర్తం ఖరారు
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:51 PM
ఎట్టకేలకు విజయనగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కొలువు దీరేందుకు ముహూర్తం ఖరారు అయ్యిం ది.
విజయనగరం రూరల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు విజయనగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కొలువు దీరేందుకు ముహూర్తం ఖరారు అయ్యిం ది. పది రోజుల కిందట పాలకవర్గానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపా ల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. అ యితే ప్రస్తుతం ఆషాఢమా సం కావడంతో పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం విషయంపై కొద్ది రోజుల కిందట ఏఎంసీ చైర్మన్‌గా నియ మితులైన కర్రోతు నర్సింగరావు నివాసం లో సమాలోచనలు జరిపారు. ఈనెల 24 వరకూ ఆషాఢ మాసం ఉన్న నేపథ్యంలో 25న శ్రావణమాస తొలి శుక్రవారం బాధ్యతల స్వీకరణ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఈ మేరకు శనివారం ఉద యం టీడీపీ నేత అశోక్ గజపతిరాజుని ఆయన నివాసంలో, ఎమ్మె ల్యే అదితి గజపతిరాజును బంగ్లా ఆవరణలో ఉన్న తన క్యాంపు కార్యా లయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్యేకంగా ధన్యవా దాలు తెలిపి నోటుపుస్తకాలు అందజేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం తేదీ విషయమై చర్చించారు. ఈనెల 25వ తేదీ శుక్రవారం వారిద్దరూ అందుబాటులో ఉన్నంటున్న నేపథ్యంలో అదేరోజు ముహూర్తంగా నిర్ణయించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..
విజయనగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 25న ఉదయం 10 గంటలకు ఏఎంసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించనున్నట్టు చైర్మన్ కర్రోతు నర్సింగరావు చెప్పారు. శనివారం ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారన్నారు. విజయనగరం నియోజకవర్గంలోని నగరం, మండల పరిధిలోని అన్ని డివిజ న్లు, గ్రా మాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.