Share News

The time for the Sirimanotsavam has been finalized. సిరిమానోత్సవానికి ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:27 AM

The time for the Sirimanotsavam has been finalized. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, సిరుల తల్లి పైడిమాంబ సిరిమానోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. తొలేళ్లు, సిరిమాను ఊరేగింపు తేదీలను దేవస్థానం ఈవో కె.శీరిష, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావుతో పాటు దేవస్థానం అధికారులు, అర్చకులు బుధవారం ఈవో కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు.

The time for the Sirimanotsavam has been finalized. సిరిమానోత్సవానికి ముహూర్తం ఖరారు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆలయ ఈఓ కె శీరిషా

సిరిమానోత్సవానికి ముహూర్తం ఖరారు

అక్టోబరు 6న తొలేళ్లు, 7న సిరిమాను ఊరేగింపు

సెప్టెంబరు 12 నుంచి పైడిమాంబ మండల దీక్షలు ప్రారంభం

విజయనగరం రూరల్‌/కల్చరల్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, సిరుల తల్లి పైడిమాంబ సిరిమానోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. తొలేళ్లు, సిరిమాను ఊరేగింపు తేదీలను దేవస్థానం ఈవో కె.శీరిష, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావుతో పాటు దేవస్థానం అధికారులు, అర్చకులు బుధవారం ఈవో కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. పైడిమాంబ మండల దీక్షలు సెప్టెంబరు 12 నుంచి ప్రారంభమౌ తాయన్నారు. పండగ షెడ్యూల్‌ను తెలియజేసే కరపత్రాన్ని కూడా ఆవిష్కరించారు. సెప్టెంబరు 12న పందిరి రాట ఉంటుందని, ఆ రోజుతో ప్రారంభమయ్యే సిరిమానోత్సవాలు అక్టోబరు 22న జరిగే చండీహోమంతో పూర్తవుతాయన్నారు. అక్టోబరు 14న పెద్దచెరువులో తెప్పోత్సవం, 19న కలశజ్యోతి ర్యాలీ, చివరిగా 22న ఉయ్యాల కంబాల ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఆలయ సూపరింటెండెంట్‌ ఏడుకొండలు, మరో అధికారి రమణి, పూజారి బంటుపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:27 AM