తోటపల్లి ఆయకట్టుకు నీరందించాలి
ABN , Publish Date - May 14 , 2025 | 12:30 AM
: తోటపల్లి బ్యారేజీ ఎడమ, కుడి కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీరందించాలని రైతు సంఘం నాయకులు కోరారు. మంగళవారం పాలకొండ సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు
పాలకొండ, మే 13 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి బ్యారేజీ ఎడమ, కుడి కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీరందించాలని రైతు సంఘం నాయకులు కోరారు. మంగళవారం పాలకొండ సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటపల్లి కుడి ప్రధాన కాలువ పరిధిలో సుమారు ఎనిమిది వేల ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ పరిధిలో 32 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి తోటపల్లి బ్యారేజీని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1902లో ఏర్పాటు చేసిందని తెలిపారు. నాగావళి నదిపై ఉన్న ఓపెన్ చానళ్లకు ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనుసంధానం చేస్తూ సాగునీరు ఇవ్వడానికి బ్యారేజీ కట్టే సమయంలో డిజైన్ చేశారన్నారు. ప్రస్తుతం బ్యారేజీ తూము వద్ద షట్టర్లు ఫంక్షనింగ్ సరిగ్గా జరగకపోవడంతో కాలువలో నీటి ప్రవాహాన్ని నియ్రంతించడానికి అవకాశం లేకుండాపోతోందన్నారు. కాలువలకు ఖరీఫ్ సీజన్‌నాటికి మరమ్మతులు చేయించి కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బుడితి అప్పలనాయుడు, గురుబిల్లి అప్పలనాయుడు, రౌతు సోంబాబు, పామోటి వైకుంఠరావు, కిమిడి రామ్మూర్తినాయుడు, వావిలపల్లి రమణమూర్తి, లోలుగు సంగంనాయుడు, కోట విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.