Share News

Education విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:38 PM

The Standard of Education Must Be Raised గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఆదేశించారు. శుక్ర‌వారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గురుకుల, పాఠశాలల హెచ్‌ఎం, ప్రిన్సిపాల్స్‌, హెడ్‌డబ్ల్యూవో, వార్డెన్లతో సమావేశం నిర్వహించారు.

 Education విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో

సీతంపేట రూరల్‌, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఆదేశించారు. శుక్ర‌వారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గురుకుల, పాఠశాలల హెచ్‌ఎం, ప్రిన్సిపాల్స్‌, హెడ్‌డబ్ల్యూవో, వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్‌ల శాతాన్ని పెంచాలన్నారు. ఏటా విద్యార్థుల సంఖ్య పెంచడానికి హెచ్‌ఎంలు చొరవ తీసుకోవాలని, పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతి గురువారం సంబంధిత పాఠశాల ఏఎన్‌ఎం, వైద్య సిబ్బంది కలిసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ‘తల్లికి వందనం’ పథకం కింద నగదు జమకాని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో పాఠశాలల్లో తాగునీటి నాణ్యత పరీక్షలు చేయించాలని, ఏటీడబ్ల్యూవోలు క్షేత్రస్థాయిలో భోజనాల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు.ఇప్పటి నుంచే టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి మెరుగైన ఫలితాల సాధనకు అందరూ కృషిచేయాలని వెల్లడించారు. విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో కూడ ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీవో చిన్నబాబు, డీడీ అన్నాదొర, డిప్యూటీ ఈవో రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:38 PM